మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4: *బుచ్చి రెడ్డిపాలెం రూరల్ మండలంలో వైసిపి ఖాళీ.*కొత్త పాత టిడిపి నాయకులు పరస్పర సమన్వయంతో పని చేసుకోవాలి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసిపి నాయకులు టిడిపిలో చేరుతున్నారు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాళెం రూరల్ మండలం నాగమాంబాపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఒంటేరు శ్రీహరి, పులి విజయ్‌కుమార్, యరగల శ్రీనివాసులు, అంబాటి శ్రీనివాసులు, షేక్ నాగూర్, బి. శశిదర్, షేక్ మౌలాలి, గడ్డం శివ, జి. శ్రీనివాసులు, షేక్ షారుఖ్, కరీంపాటి చంద్ర, చినిగి వంశీ, అంబటి చైతన్య, ముక్కు శ్రీనివాసులు తదితర ముఖ్య నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో వైసిపి వీడి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ……..కొత్త పాత నాయకులు పరస్పర సమన్వయంలో కలిసి పని చేసుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ఐకమత్యంగా గ్రామాభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కొత్తగా టిడిపిలోకి చేరిన వైసిపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టిడిపిలో చేరుతున్నట్టు నాగమాంబాపురం నాయకులు తెలిపారు. వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బీదా గిరిధర్, బుచ్చి మండల టిడిపి నాయకులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, బత్తల హరికృష్ణ, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

