మన ధ్యాస,బుచ్చిరెడ్డిపాలెం ,సెప్టెంబర్ 2:-*డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. * 50 లక్షలతో గుడిపల్లి కాలువలో పూడిక తీత, ప్రొటక్షన్ వాల్ నిర్మాణాన్ని చేపడతాం. * చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. *ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలియ చేసారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో భాగంగా ఆమె బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని 11 వార్డులో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……… మ్యుఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితో నిత్యం ప్రజలలో వుంటూ ప్రజాసేవ చేయడానికే రాజాకేయాల లోనికి వచ్చానన్నారు. 50 లక్షల వ్యయంతో దుర్గంధ మయంగా మారిన గుడిపల్లి కాలువలో పూడిక తీయడంతో పాటు ప్రొటక్షన్ వాల్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడుతానన్నారు. గుడిపల్లి కాలువ కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. మున్సిపల్, కమీషనర్ మరియు ఛైర్ పర్సన్లతో చర్చించి గుడిపల్లి కాలవ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూటమి పార్టీల నేతల సమక్షంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు. చంద్రబాబు నాయుడు యిస్తున్న ప్రోత్సాహం కారణంగానే తాను రాజకీయాలలో రాణిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా వుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి మౌలిక వసతులు కల్పించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ డి బాలకృష్ణ, ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మన్లు యారటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, స్థానిక కౌన్సిలర్ రాచూరి సత్యం, టిడిపి అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, టిడిపి బుచ్చి మండల గౌరవాధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఎంవి శేషయ్య, కోడూరు కమలాకర్ రెడ్డి జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు, మహేంద్ర లతో పాటు బుచ్చి పట్టణ కౌన్సిలర్లు, టిడిపి యూనిట్ మరియు క్లస్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.






