ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ , నాయకులు, కార్యకర్తలకు భరోసా..///

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌

వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా

క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలతో మమేకం

పులివెందుల/మన ద్యాస న్యూస్ :////

పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూ­డదన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పు­డు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులై­న ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్‌ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ నేత­లు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్ట­డ­మే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశా­రు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్‌ జగన్‌ సూచించారు.

  • Related Posts

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

    ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..