ఒకే వొరలో రెండు కత్తులా

-ఉరవకొండ, మన ధ్యాస : మండల పరిధిలోని ఆమిద్యాల టిడిపిలో వర్గ పోరు నెలకొంది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

– తాజాగా మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రశ్నించిన ఓ నాయకుడికి నిర్వాహకులకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తొలుత  వాగ్వివాదాలు చోటు చేసుకోగా ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు సిద్ధమయ్యారు. తోపులాటలో మాజీ మండలాధ్యక్షురాలు సోదరుడు కిందకుపడ్డారు. తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులు ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాధ్యు నిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చారు. అయితే ఒకే పార్టీకి చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేయటానికి పోలీసులు మీనమేషాలు లెక్కించారు. కాగా పోలీసులు సోమవారం నుంచి నిందితున్ని అదుపులోనికి తీసుకొని అటు కేసు నమోదు చేయక ఇటు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచక పోలీసులు న్యాయ సూత్రాలకు త్రిలోధకాలు ఇచ్చారు. అరెస్టు చేసిన 24 గంటల్లోగా స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట నిందితున్ని హాజరుపరచాలి. అలా హాజరు పరచటం లేదు. కాగా మధ్యాన్న భోజనం నాణ్యత విషయంలో ప్రశ్నించిన తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని హత్యాయత్నం 307 కింద ఆరోపణలు చేయటం తగదని ఆరోపించారు.

–  ఒకే వొరలో రెండు కత్తులా? మాజీ మండలాధ్యక్షురాలు అప్పట్లో సర్పంచ్ బరిలో ఉండగా ఇదే స్థానానికి టిడిపి చెందిన నాయకుడి భార్యని బరిలో దించారు. అధిష్టానం కలుగజేసుకొని అప్పట్లో ఆ నాయకుని భార్యను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ నాయకుడు ఓటమికి కృషి చేశారని ఆరోపణలు మాజీ మండల అధ్యక్షురాలి కుటుంబీ కులు ఆరోపణలు గుప్పించారు.. అది మనసులో ఉంచుకొని అప్పటినుంచి వారి వర్గపోరు నెలకొంది. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ గానే నెగ్గి అనంతరం మండల అధ్యక్షురాలుగా పనిచేశారు. భోజన ఏజెన్సీ సైతo నిర్వహిస్తున్నారు భోజన ఏజెన్సీ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాగ్వివాదాలు దాడులు చేసుకోవటం పరిపాటి అయ్యింది. చిన్నపాటి తగాదాలకు అత్యాయత్నం కేసు నమోదు చేయటం ఏమిటని ఒక వర్గం వాదన. ఏది ఏమైనా ఆరోపణలు ప్రతి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేసు కౌంటర్ కేసు నమోదు చేసుకొని చర్యలు చేపట్టాల్సిన పోలీసులు నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకొని న్యాయస్థానం ఎదుట హాజరు పరచకుండా ఏకపక్షంగా వ్యవహరించటం తగదు.

– మేజర్ గ్రామపంచాయతీలో టిడిపి నాయకుల మధ్య ఆదిపత్య కోరుతూ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇక్కడ మరో వర్గం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా సమస్య కోసం ఒక వర్గం వద్దకు వెళితే రెండో వర్గం, మోకాలు అడ్డటం మూడో వర్గం దగ్గరికి వెళితే మిగతా రెండు వర్గాలు మోకాలు అడ్డం జరుగుతోంది. ఏది ఏమైనా వర్గ పోరుకు పులిస్టాప్ పెట్టించే విధంగా అధిష్టానం చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో పార్టీకి నష్టం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని టిడిపి శ్రేణుల భావన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *