మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు క్రీడా విభాగ ఆధ్వర్యంలో భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత అద్యక్షత వహించి ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక, మరియు సామాజిక అభివృద్ధికి పునాది వేస్తాయని,ఆరోగ్యకరమైన, సమతుల్యమైన,విజయవంతమైన జీవితానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించే ఒక అద్భుతమైన మార్గమని శారీరక దృఢత్వం,ఆరోగ్యకరమైన బరువు,శక్తి మరియు సమన్వయం,మానసిక ఆరోగ్యం ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత,జట్టుకృషి,క్రమశిక్షణ మరియు బాధ్యత, విలువలు మొదలైన అంశాలు క్రీడలు ద్వార సాద్యమవుతాయని కాబట్టి విద్యర్డులందరూ చదువుతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాదాన్యత ఇవ్వాలని, సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల వలన అనేక రుగ్మతలు ఏర్పడుతున్నాయని వీటి నుంచి రక్షణ పొందడానికి క్రీడలు శారీరక శ్రమ చాల అవసరమని సూచించారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం పురష్కరించుకొని విద్యార్దిని విద్యార్దులకు అనేక ఆటల పోటీలు కబాడీ, ఖోఖో, షటిల్, చెస్, కేరమ్స్ వంటి గేమ్స్ లు నిర్వహింఛి, గెలుపొందిన జట్టులకు బహుమతి ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమలో వైస్ ప్రిన్సిపాల్ కే. వెంకటేశ్వరరావు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డా. ప్రయాగ మూర్తి ప్రగడ,క్రీడల ఇంచార్జ్ కే సురేష్, వి. రామరావు, కె.శ్రీలక్ష్మి, శివ ప్రసాద్, మదీనా,వీరభద్రరావు, బంగార్రాజు, కుమారి రోజలిన , సతిస్,రాజేష్ అద్యపకేతర సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *