

తవణంపల్లి ఆగస్టు 28 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్ స్వచ్ఛంద సంస్థ చిత్తూరు ఆధ్వర్యంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, ఐ ఈ సి క్యాంపింగ్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 ఏ ఆర్ టి మందులు, ఏపీ ఎస్ ఏ సి ఎస్ ఏపీపీ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ , చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్. సద్దాం మరియు ఓ ఆర్ డబ్ల్యు ద్రాక్షాయిని సుజాత,ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.