


మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):
రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం నుంచి నీటి ప్రవాహం మరింత పెరిగింది.ఈ వరద ప్రవాహంతో బొగ్గు గుడిసె చౌరస్తా తీవ్ర నష్టానికి గురైంది. చౌరస్తాలోని అనేక షాపులు నీటిలో మునిగిపోయి సామాను నష్టపోయింది. వ్యాపారుల ఉపాధి ఒక్కసారిగా సంకటంలో పడిపోయింది. రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. రైతులు కూడా పంట నష్టంతో ఆందోళన చెందుతున్నారు.స్థానికంగా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. అధికారుల ద్వారా నష్టపరిహారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా చెల్లిస్తే, జీవనోపాధి కొనసాగించుకోవడానికి కొంత ఊరట కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

