




మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద 765 డీ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో పనులు చేస్తూ వచ్చిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా పెరగడంతో, అక్కడ పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు వాటర్ ట్యాంకు పైన ప్రమాదంలో చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రిస్క్యూ టీంను అప్రమత్తం చేసి, అతి జాగ్రత్తగా కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అధికారులు తక్షణమే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అదే సమయంలో మొహమ్మద్ నగర్ మండలంలోని గుణ్కుల్ గ్రామ శివారులోని వాగులో ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని, ప్రత్యేక పరికరాల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీశారు.ఈ రెండు ఘటనల్లో అధికారుల వేగవంతమైన చర్యల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరంతా ఊపిరి పీల్చుకునేలా చేసింది. గ్రామస్తులు అధికారులు, రిస్క్యూ టీం మరియు ఫైర్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నాయకులు ఖాళీక్,తదితరులు ఉన్నారు.

