మన ధ్యాస ,ముత్తుకూరు, ఆగస్టు 25:*గతం మాదిరిగా కాకుండా లబ్ధిదారుల ఫొటోలతోనే రేషన్ కార్డులు.సర్వేపల్లి నియోజకవర్గం ,ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని కార్యక్రమం సోమవారం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయకుమార్, తదితరులు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ………………..క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం అని అన్నారు.సరుకులు పొందిన, పొందని వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా కనిపించేలా క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు.రేషన్ పంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాలను సరిదిద్దేందుకు ఈ స్మార్ట్ కార్డులు దోహదం చేస్తాయి అని అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సౌకర్యవంతంగా అనేక మార్పులు తీసుకొస్తోంది అనిఅన్నారు.వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరుకులు అంటూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వాహనాలను తెచ్చారు అని అన్నారు.ఆ వాహనాలు వచ్చిన సమయంలోనే రేషన్ సరుకులు తీసుకోవాలి…అవి కూడా ఇంటి వద్దకు రావు..వీధిలో ఎక్కడో ఒక చోట నిలుపుతారు..వాహనాలు వచ్చిన గంటలో రేషన్ సరుకులు తీసుకోకపోతే ఇక ఆ నెలలో కట్ అని అన్నారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో పాత విధానాన్ని అమలులోకి తెచ్చింది అని అన్నారు.1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు ఏ రోజైనా రేషన్ షాపుకి వెళ్లి సరుకులు పొందవచ్చు అని అన్నారు.65 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు నేరుగా ఇళ్ల వద్దకే సరుకులే ఇచ్చే ఏర్పాటు చేసింది..ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వారికి సరుకులు అందజేస్తున్నారు.మొదట రేషన్ కార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో పేదల ప్రయోజనాల కన్నా పాలకుల ఫొటోలకే ప్రాధాన్యమిచ్చారు అని అన్నారు.ఇప్పుడు మా ప్రభుత్వం కేవలం లబ్ధిదారుల ఫొటోలతోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *