మన న్యూస్, కోవూరు : మృత్తి చెందిన కార్యకర్త సుధీర్‌ కుటుంబానికి పార్టీ 5 లక్షల సాయం- బాధిత కుటుంబానికి చెక్కు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- విపిఆర్‌ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాంమన న్యూస్ ,కోవూరు, ఆగస్టు 23కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు , నారా లోకేష్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, కార్యకర్తలే పార్టీకి ప్రాణమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. పడుగుపాడులో సొసైటీల ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల చెక్కును అందించారు. వివరాల మేరకు.. జమ్మిపాలెంకు చెందిన మల్లపాటి సుధీర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. రూ.100తో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడి పనిచేశారు. అయితే 3 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో సుధీర్‌ మృత్యువాత పడ్డారు. దాంతో ఆ కుటంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. దీనిపై వెంటనే స్పందించిన మండల పార్టీ నాయకులు విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. సుధీర్‌ సభ్యత్వ కార్డులు, మృతి వివరాలు తెలియజేశారు. దాంతో వెంటనే అధిష్టానం కార్యకర్త సుధీర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును మంజూరు చేసింది. ఆ చెక్కును శనివారం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ బాధిత కుటుంబానికి అందజేశారు. సుధీర్‌ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌ కు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహాయ సహకారాలతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుధీర్‌ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఆమె వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *