ఉరవకొండ మన న్యూస్:
ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఇద్దరు సీనియర్ న్యాయవాదుల మధ్య విభేదాలు భగ్గుమంటుతున్నాయి. ఒకరు తన సహ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.రాకెట్ల గ్రామానికి చెందిన ఓ క్లైంట్ సలహా కోసం సీనియర్ న్యాయవాదిని సంప్రదించగా, దీనిని జీర్ణించుకోలేకపోయిన మరో న్యాయవాది కోర్టులోకి ఆ క్లైంట్ రాకూడదని అడ్డుకోవడమే కాకుండా, మళ్లీ వస్తే నిన్ను కూడా రానివ్వనని సీనియర్ న్యాయవాదికి హెచ్చరించారు. సహనం కోల్పోయిన ఆ న్యాయవాది చివరకు బండబూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామంపై బాధిత న్యాయవాది మెజిస్ట్రేట్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సాధారణంగా కక్షిదారులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారు. కానీ వారిని కోర్టులోకి అనుమతించవద్దని హుకుం జారీ చేయడం, అనుమతిస్తే తోటి న్యాయవాదిని కూడా బహిష్కరిస్తామని బెదిరించడం చట్టపరంగా, వృత్తిపరంగా పూర్తిగా తప్పు అని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదే న్యాయవాది గతంలోనూ అనేక తప్పుడు కేసులు వాదిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కూడా ఆయనపై బార్ కౌన్సిల్‌కి ఫిర్యాదులు వెళ్లాయి. ఉరవకొండకు చెందిన న్యాయవాది మీనుగ మధుబాబు గతంలో ఇతని దుర్వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వృత్తి విలువలకు విరుద్ధంగా క్లైంట్లను బెదిరించడం, బ్లాక్మెయిలింగ్ చేయడం వల్ల ఈ న్యాయవాది ప్రతిష్ట నిత్యం దిగజారిపోతోందని న్యాయవాదుల వర్గాలు చర్చిస్తున్నాయి.బార్ కౌన్సిల్ జోక్యం కావాలి:
ఈ ఘటనపై న్యాయవాదుల సంఘాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “సహ న్యాయవాదిపై దౌర్జన్యం ప్రదర్శించిన ఆ (అ)న్యాయవాదిని వెంటనే బార్ కౌన్సిల్‌ నుంచి సస్పెండ్ చేయాలి” అని ఎమ్మార్పీఎస్ నాయకుడు, సహ చట్టం జిల్లా కార్యదర్శి మీనుగ మధుబాబు డిమాండ్ చేశారు. ఏది ఏమైనా… ఈ ఘటన న్యాయవాద వృత్తి గౌరవానికి కలంకమని భావిస్తున్న న్యాయవాదులు, కక్షిదారులు. బాధిత న్యాయవాది ఫిర్యాదుపై మెజిస్ట్రేట్ ఏ విధంగా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *