మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం డియస్పి ని వైస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ కిలివేటి సంజీవయ్య కలిసి వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసుల గురించి చర్చించారు.అనంతరం ఎస్పీ కార్యాలయం బయట పాత్రికేయులతో వైఎస్ఆర్సిపి నేతలు మాట్లాడారు.ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనను పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ కారూమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్ఆర్సిపి నేతలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతోందని మండిపడ్డారు. ఇటీవల నెల్లూరు పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సమయంలో వైఎస్ఆర్సిపి నేతలను ఇబ్బంది పెట్టేలా కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలు అందరికి తెలిసినవేనన్నారు.వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా, రహదారుల్లో గుంతలు తీయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం.. వస్తున్న వారిని ఎక్కడికి అక్కడ అడ్డుకొని అరెస్టులు చేయడం చూసామన్నారు.ఇలాంటి దుష్ట సంస్కృతిని రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదన్నారు.అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ని కలిసేందుకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తే ఈరోజు వారిపై అక్రమకేసులు బనాయిస్తుండగా చూస్తుంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ విషయంపై ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం ఇద్దామని వస్తే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డిఎస్పీ కి మెమోరాండం అందజేశామని తెలిపారు.జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నేతలపై కక్షపూరితంగా కేసులు నమోదు చేయిస్తుందని ఈ పద్ధతి సరికాదని ఇలాంటి వాటిని పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ప్రోత్సహించవద్దని కేసులు పెట్టే పద్ధతి మానుకోవాలని తెలిపామన్నారు.ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఇష్టానుసారంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని అన్నారు.కూటమి ప్రభుత్వం చెబుతున్న వైఎస్ఆర్సిపి నేతల పేర్లను మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు.ఆ ఘటనలు జరిగిన సమయంలో వారు అక్కడున్నారా లేదా అన్న కనీస అవగాహన కూడా లేకుండా వారు ఏ సెక్షన్లు చెబితే ఆ సెక్షన్లు పెట్టి దుర్మార్గంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కీలుబొమ్మగా మారిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా సహకరిస్తూ వస్తుందన్నారు.జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రోజు పోలీసులే వైఎస్ఆర్సిపి నేతలపై లాఠీచార్జ్ చేసి వారిని కిందపడేసి తిరిగి వైస్సార్సీపీ నేతల పైనే అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికే ఈ విషయంలో 25 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి ఉన్నారని అన్నారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారని అన్నారు.కావలిలో ఒకచోట ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో అక్కడ నిఘా ఉంచి ఫోటోలు తీయడానికి మనుషులను పంపితే రెక్కి నిర్వహించారని అభియోగం మోపడం దుర్మార్గమన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.వైఎస్ఆర్ సీపీ నేతలు.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ప్రతి ఒక్కరి పై అక్రమ కేసులు నమోదు చేయాలననే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని అన్నారు.వైఎస్ఆర్సిపి నేతలను అనవసరంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్న తెలుగుదేశం పార్టీని చూసి ప్రజలు కూడా భయపడుతున్నారని అన్నారు.రేపు ప్రజల మీద కూడా అక్రమ కేసులు బనాయి ఇస్తారేమో నన్ను సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు వారిని కలిసి అన్ని తెలియజేయడం జరిగిందన్నారు.అక్రమ కేసులు విషయంలో మార్పు రాకుంటే రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో.. ఆలోచన చేసి పటిష్టమైన కార్యచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు.

