

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు: నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఆదివారం ముత్తుకూరు రోడ్డు లో ఉన్న పచ్చిపులుసు శ్రీరాములు కళ్యాణమండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ప్రవచనాలను వచ్చిన భక్తులు కార్యక్రమం అయ్యేంతవరకు భక్తీశ్రద్ధతో విన్నారు.కోట రమేష్ మాట్లాడుతూ….. లయన్స్ క్లబ్ అంటే సేవ, సేవ లో భాగంగా లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని అన్నారు.అందులో భాగంగా ప్రజలకు ఏం కావాలి, ఏమి చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించి ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ఈ ఈరోజు కార్యక్రమానికి డాక్టర్ గరికపాటి నరసింహారావు పిలిచాము అని అన్నారు. డాక్టర్ గరికపాటి నరసింహారావు కుటుంబ వ్యవస్థ మీద ప్రవచనాలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి, కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.యుగంధర్ మాట్లాడుతూ…… సమాజానికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని లయన్స్ క్లబ్ ద్వారా సేవలు చేస్తుంటాము అని అన్నారు. అలాగే మంచి ప్రవచనాల ద్వారా సమాజం మేలుకొలపాలని పెద్ద కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నాము. అందులో భాగంగా డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు నిర్వహించాలని అనుకున్నాము. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకని మంచి మాటలతో కుటుంబ వ్యవస్థ గురించి డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు రెండున్నర గంటలపాటు భక్తితో వచ్చిన వారు విన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు నుండే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుండి వచ్చారు. ఈ కార్యక్రమంకు స్పాన్సర్ కు చేసిన వారికి, వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.పేర్ల సీతారామారావు మాట్లాడుతూ……. నెల్లూరు నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని బహుత్తర కార్యక్రమాన్ని సమాజం కోసం కుటుంబ వ్యవస్థ గురించి డాక్టర్ గరిపాటి నరసింహారావు ప్రవచనాలు ద్వారా నిర్వహించాము అని అన్నారు .గరికపాటి నరసింహారావు కుటుంబ వ్యవస్థ గురించి విప్లవంగా, అందరికి అర్థం అయ్యే రీతిలో ప్రవచనాలు ప్రసంగించారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్, వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తాత వెంకట కిషోర్ మాట్లాడుతూ…. మా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని వారు అందరూ, అందరి కుటుంబాలు బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహించినామని అని అన్నారు. నిజంగా దీనివల్ల నెల్లూరు లోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి ,కుటుంబ బంధాలు ఎలా ఉండాలి, పెద్దవాళ్లు చిన్నవాళ్ళు ఎలా మెలగాలి అని కుటుంబ వ్యవస్థ గురించి విపులంగా తన ప్రవచనాల ద్వారా గరికపాటి నరసింహారావు వెల్లడించారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గరికపాటి నరసింహారావు కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని సభ్యులు పాల్గొన్నారు.




