

డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* అల్లిపురం డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ* గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచి పోయింది* అక్టోబర్ 2,2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్త గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే చర్యలు చేపడతాం.రానున్న మూడు సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేనివిధంగా డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. అల్లిపురం తొమ్మిదో డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …….గత సంవత్సరం అక్టోబర్ 2-2024న స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ,ఈ సంవత్సరం అక్టోబర్ 2,2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్త గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచి పోయిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు 65 లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు. రోజుకు 26 వేలు టన్నుల చెత్తను చేయడం జరుగుతుందని దానిని రోజుకి 30 వేల టన్నుల చెత్తను తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుందన్నారు. మూడు ప్రదేశాలలో డంపింగ్ యార్డ్ లు ఉన్నాయన్నారు అల్లిపురం, దొంతాలి వద్ద రెండు చెత్త డంపింగ్ యార్డ్ లు ఉన్నాయని. ఆయన అన్నారు సెప్టెంబర్ నాటికల్లా డంపింగ్ యార్డులలో చెత్తను నివారించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గుంటూరు విజయవాడ వంటి నగర ప్రదేశాలలో డంపింగ్ యార్డ్ లేవని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు రెండు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. కొత్తగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా టెండర్లు త్వరలో పిలవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, రెవెన్యూ డివిజన్ అధికారి అనూష ,టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు,రాష్ట్ర sc సెల్ సెక్రటరీ.కువ్వరపునాగేశ్వరరావు,సుబ్బలక్షి,శివతేజ,శ్రీహరి ప్రసాద్,టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

