

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా , సారా అమ్మిన కాచిన చట్టరీత్యా నేరం అందుకు శిక్ష తప్పదని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గురువారం సారా అమ్మిన ఇద్దరు వ్యక్తులపై ఒక్కొక్కరికి 10వేలు చొప్పున 20వేలు అపరాధ రుసుము విధించారు. అదేవిధంగా 33 మందిపై సారా కేసులు నమోదు చేసి 200 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్న మన్నారు. అలాగే స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో 4800 లీటర్ల బెల్లం ఓటర్లను ధ్వంసం చేశామన్నారు. సారా కాచి, అమ్మిన 80 మంది పాత కేసుల్లో నిందితులైన వారిపై కేసులు నమోదు చేసామన్నారు. వివిధ ప్రాంతాల్లో సారా కాచి అమ్మిన168 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అందులో భాగంగానే 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇకపై ఎవరైనా సారా అమ్మాలని చూసిన,, కాయాలని చూసిన చట్టరీత్యా శిక్షలకు బాధ్యులవుతారని పత్రికా ముఖంగా హెచ్చరించారు. అదేవిధంగా మీ మీ ప్రాంతాలలో ఎవరైనా సారా అమ్ముతున్న సారా కాచిన ఈ క్రింది ఫోన్ నెంబర్లకు నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలియజేయగలరని కోరారు. వివరాలు తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పుకొచ్చారు.