గూడూరు, మన న్యూస్:- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 20వ రోజు లో భాగంగా.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్
మాట్లాడుతూ గతంలో ఎలెక్షన్ ప్రచారంలో మహశక్తి కార్యక్రమం లో ఇచ్చిన హామీ లలో భాగంగా
సిద్ధమఖండ్రిగ గ్రామం నందు 10 లక్షల రూపాయలతో CC రోడ్ ను ప్రారంభించాము .జివిఆర్ కంపెనీ సహాయంతో సిద్ధమఖండ్రిగ గ్రామం నందు గ్రామస్థుల త్రాగు నీటి కోసం 10.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాము, రాఘవాపురం గ్రామం నందు 10 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించారు. పంచాయతీ నందు 585 పెన్షన్లు అందిస్తున్నాం. తల్లికి వందనం కింద 535 మందికి 69 లక్షల 55 వేలు అందించాం. అన్నదాత సుఖీభవ కింద 569 మందికి గాను 28 లక్షల 45 వేలు అందించాము. ఈ సంవత్సరం కాలంలో మొత్తం 1 కోటి 48 లక్షల 59 వేల తో అభివృధి సంక్షేమం అందించాము అన్నారు. గత ప్రభుత్వం లాగ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఎలెక్షన్ ప్రచారం లో చెప్పిన విధముగా అన్ని అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *