

- అగ్ని ప్రమాద బాధితులకు ఏపూరి శ్రీను ఆర్థిక సహాయం
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు అన్నారు. చిన్న శంకర్ల పూడి గ్రామంలో నాలుగు రోజుల క్రిందట ఎస్సీ పేటలో ఆరు దళితుల తాటి కిల్లు దగ్ధమై కట్టుబట్టలతో నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. మంగళవారం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఏపూరి శ్రీనివాసరావు పరామర్శించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం, నెలకి సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశారు. బాధితుల కుటుంబాలను ఓదార్చి ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించే లాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఇటువంటి పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నిరుపేద దళిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నెల రోజుల్లో లోపు బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ను ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సత్యనారాయణ, గోళ్ళ సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేశుల చక్రబాబు, షేక్ సుభాన్, చనిబోయిన నాగేశ్వరావు, తంగేళ్ల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.