జర్నలిస్టుల సమస్యలపై తహసీల్థార్‌ కి వినతిపత్రం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇంచార్జ్ తహసీల్థార్‌ పొన్నాలుకు వినతిపత్రం అందజేశారు.మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్‌ని పురస్కరించుకుని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు స్వర్ణ పూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్కింగ్‌ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు జారీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.అక్రిడేషన్లు లేకపోవడంతో జర్నలిస్టులు పలు సదుపాయాలు పొందలేకపోతున్నారని చెప్పారు. పాత అక్రిడేషన్ల గడువును పలుమార్లు పొడిగిస్తూ కొత్త అక్రిడేషన్లు జారీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.దీనితో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్‌ లేకపోవడమే కాకుండా వారికి ఆరోగ్య బీమా,ఇతర సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న జర్నలిస్టులకు ఇప్పటికీ కొత్త అక్రిడేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికే మూడు విడతలుగా అక్రిడేషన్ల గడువు పొడిగించుకుంటూ వచ్చినట్లు వివరించారు.ఆగస్టు 31తో మరోసారి గడువు ముగిస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం, పక్కా గహ నిర్మాణం,ఆరోగ్య భీమా తదితర సౌకర్యాలు కల్పించాలని జర్నలిస్టులు కోరారు.ఈ కార్యక్రమంలో కుంపట్ల ప్రసాద్,శలా మల్లికార్జునరావు,మువ్వల శ్రీను, పారేపల్లి గంగా ప్రసాద్,దాసరి కృష్ణ, గొల్లపల్లి రాజబాబు,పోతుల లావరాజు,ఆకుల శివాజీ,రాచర్ల రమేష్,శిడగం మాధవ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు