

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు.
మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మట్ల చిన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన జాతీయ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఫ్రోజెన్ ఫుడ్ కంపెనీ లోనే పలు విభాగాలను పరిశీలించారు.కంపెనీ నుంచి విడుదలయ్యే నీటి నమూనాలను సేకరించారు. తనిఖీలపై కంపెనీ ట్రిబ్యునల్ అధికారులు కానీ యాజమాన్యం గాని, సిబ్బంది గానీ ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. స్థానిక పాత్రలు పెద్దాపురం ఆర్డిఓ ను వివరణ కోరగా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.మట్ల చిన్ని మాట్లాడుతూ అవంతి కంపెనీ నుంచి రొయ్యలకు సంబంధించిన వ్యర్థాలను పోలవరం కాలువలోకి విడుదల చేస్తున్నారని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవంతి కంపెనీ ద్వారా విడుదలయ్యే కాలుష్యానికి అనారోగ్యాలు పాలవుతున్నారని ప్రభుత్వం దీనిపై స్పందించి నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.