

మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు : సాయం అంటే ఆమడ దూరం పోయే రోజులివి, ఎదుట వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం ఖచ్చితంగా గొప్ప విషయమే.నిరుపేదల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత ముదునూరి మురళీకృష్ణంరాజు శనివారం రెండు కుటుంబాలకు తన వంతు సాయం అందించి మరో మారు దాతృత్వం చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే ప్రత్తిపాడు మండలం, బవురువాక గ్రామానికి చెందిన చింతల లోవరాజు తల్లి ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత ముదునూరి శనివారం ఆ గ్రామానికి వెళ్లి చింతల కుటుంబాన్ని పరామర్శించి రెండు బస్తాల బియ్యం 5000 రూపాయలు నగదు సాయం చేశారు.అనంతరం గిరిజనుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే ఒమ్మంగి గ్రామానికి చెందిన మెహరా దేవత ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆమెను ముదునూరి పరామర్శించి రూ.5000 నగదు అందించారు.ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అంటే ఓట్లు పొందడం కాదని,ప్రజల సమస్యలు పరిష్కరించడానికి,ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగాఉండాలన్నారు.ఏ నాయకుడైనా కార్యకర్తపై అనురాగం,అభిమానం చూపిస్తూ మనస్సును గెలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు రామిశెట్టి బుల్లి రామకృష్ణ(నాని),సర్పంచ్ లక్ష్మి,వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనివాస్,కోదండం నాగేశ్వరరావు,సతీష్ రాజు, కోలా తాతబాబు,యాళ్ల ఏసు,మాగాపు శివ,కొప్పన వెంకన్నబాబు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు