పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు, కొత్తపట్నం వీఆర్ఓ కు గూడూరు ఎమ్మెల్యే హెచ్చరిక!

గూడూరు, మన న్యూస్ :- ‘కోట మండలం కొత్తపట్నం వీఆర్ఓ వెంకటేశ్వర్లు వైఖరితో ఇబ్బందులు పడుతున్నాం.. లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదు.. గ్రామాలలోని భూ రికార్డులకు సంబందించిన తప్పుడు నివేదికలు ఇస్తూ తహసీల్దార్ ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు. దీంతో గ్రామాల్లో వివాదాలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి.. వీఆర్ఓను బదిలీ చేయండి’ అని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు చెంగళ్ రావు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ను విజ్ఞప్తి చేసారు. తిరుపతి జిల్లా కోట మండలం గోవిందపల్లి గ్రామంలో సోమవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఏడాది కాలంగా ఓటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాల్సిందిగా ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు చెంగళ్ రావు కొత్తపట్నం విఆర్ఓపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకొని రికార్డులు తారుమారు చేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. వీఆర్వో వెంకటేశ్వర్లు పనితీరుతో పేదలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. అవినీతి వీఆర్ఓతో తాము వేగలేకున్నామని బదిలీ చేయాలని ఎమ్మెల్యేను బాధితుల తరపున చెంగళ్ రావు విన్నవించుకున్నారు. టీడీపీ నాయకుడు చెంగళ్ రావు విజ్ఞప్తికి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వీఆర్ఓ తీరుపై మండిపడ్డారు. ‘మా ప్రభుత్వంలోనే మా నాయకుల కోరిక మేరకే నిన్ను ఇక్కడకి మార్చింది.. పేదలకు అందుబాటులో ఉంటావని.. పేదల దగ్గర డబ్బులు గుంజుతావని కాదు.. మళ్ళీ మళ్ళీ ఆరోపణలు వస్తే ఇబ్బంది పడతావ్.. ఇందులో సందేహమే లేదు.. ఎమ్మార్వో ఆదేశానుసారం విధులు నిర్వర్తించక.. మా నాయకులకు పనులు చేయక.. పేదలకు న్యాయం చేయక.. ఇష్టారీతిన వ్యవహరించడం మంచి పద్ధతి కాదు.. ఇకపై నిన్ను వదిలే పరిస్థితి లేదు.. పేదలు కట్టే పన్నులతో జీతం తీసుకొంటున్నావ్.. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని వార్నింగ్ ఇస్తూ వీఆర్ఓపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు కోరుతానని ఎమ్మెల్యే తెలిపారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ