

మన న్యూస్ సాలూరు ఆగస్ట్ 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో జిల్లేడు వలస బొర్రా పనికు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాసిల్దారు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిధరపు అప్పారావు మండల కార్యదర్శి గేమ్మెల జానకిరావు మాట్లాడుతూ మండలంలో పేదలు గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇచ్చిన అటవీ పట్టాలకు వన్ బి రాకపోవడం వలన బ్యాంకు రుణాలు రావడం లేదని తెలిపారు గతంలో అనేక సందర్భాల్లో సర్వేలు చేసిన నేటికీ పట్టాలు పంపిణీ చేయకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేయాలని కోరారు మండలంలో కరాసవలస, నేలిపర్తి కురుకూటి తదితర గ్రామాల్లో పేదలు సాగులో ఉన్న దశాబ్దాలు గడుస్తున్న నేటికీ పట్టాలు ఇవ్వడం లేదని అనేకసార్లు పట్టాలు ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్న పోరాడుతున్న పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లేడు వలస బోర్రపనుకు వలస గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన పోరాటాలు చేయగా పట్టాలిస్తామని అధికారులు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ నేటి వరకు అమలు చేయలేదని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.బోర్ర పనుకువలస గ్రామ గిరిజనులకు పంపిణీ చేయవలసిన పట్టాలు తాసిల్దార్ కార్యాలయం నుండి కనబడకుండా పోయావని వాటి స్థానంలో మరలా కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నేలిపర్తి గ్రామానికి చెందిన దళితులు ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న అనేక సందర్భాల్లో పట్టాలు కోరిన నేటి వరకు పట్టాలు పంపిణీ చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే సాగులో ఉన్న వారందరికీ సర్వేలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజనసంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్రావు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి , లింగాల చంటి, బొంగ ప్రసాదు రేగిడి పోలయ్య బొంగు కృష్ణ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.