జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రెస్ స్టిక్కర్ లు-నకిలీ విలేఖరులకు చెక్

ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నమంటూ చలమణి నకిలీ విలేకరులకు చెక్, నూతన వ్యవస్థ కు శ్రీకారం చుట్టిన తిరుపతిజిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నట్లు చెప్పుకొస్తున్న నకిలీల నుండి ఇబ్బందిపడుతున్న అసలైన మీడియా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లను రూపొందించిన జిల్లా ఎస్పీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేపేరు, పని చేస్తున్నా సంస్థ పేరు,డెసిగ్నేషన్, ప్రభుత్వ గుర్తింపుతో కలెక్టర్ ఇచ్చిన అక్రిడేషన్ నెంబర్ వస్తుంది. స్టిక్కర్లు ఇవ్వడం వలన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంటూ చెప్పుకుని తిరుగుతున్న నకిలీ విలేఖరుల బాగోతం బట్ట బయలు. ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకుక్యూఆర్ కోడ్స్ స్టిక్కర్లు అందజేసిన ఎస్పీ. తిరుపతిజిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ కు కృతజ్ఞతలు:జర్నలిస్ట్ సంఘాలు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా లో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం! అక్షరం ముక్కరాని వారికీ ‘రిపోర్టర్’ ట్యాగ్ – విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? ఇప్పటి జర్నలిజం రంగం వింత దశకు చేరింది. 5 వ తరగతి కూడా పూర్తిచేయని, విలక్షణంగా అక్షరమాత్రం తెలియని కొందరు వ్యక్తులు ‘రిపోర్టర్’ అనిపించుకుంటూ, విలేకరితనాన్ని నాసిరకంగా మార్చేస్తున్నారు. అసలు సమస్యలపై రాయడం దేవుడెరుగు, ఒక మ్యాటర్ కరెక్ట్‌గా రాయలేని స్థితిలో ఉన్నవారు ఇప్పటికీ పులిస్టాప్లు కూడా పెట్టలేరు. అయినా వారు జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క పేపర్లో ఏదో ఒక చిన్న న్యూస్ వచ్చిందని పట్టుకొని, స్థానిక అధికారుల దగ్గర లేదా వ్యాపారులపై వత్తిడి తేవడం, కొన్ని సందర్భాల్లో వసూళ్లకు పాల్పడటం వంటి దురాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజంగా కాలాన్ని సాక్షిగా తీసుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పాత్ర కలం, ఇప్పుడు కొందరి చేతుల్లో నష్టానికి గురవుతోంది. అంతేగాక, నకిలీ ఐడీ కార్డులు, ఫేక్ న్యూస్ పోర్టల్స్, వాట్సాప్ ఫార్వార్డులతోనే మీడియా ప్రతినిధులమని డొక్కాలు వేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. వీరి వలన నిజమైన విలువలతో కూడిన జర్నలిజానికి పెద్ద దెబ్బ తగులుతోంది. ప్రజల్లో మీడియాపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. నకిలీలను అరికట్టే చర్యలు ఏవీ? నిజమైన విలేకరులను కాపాడేందుకు, నకిలీ జర్నలిస్టులను అరికట్టేందుకు ప్రభుత్వం, మీడియా హౌసులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా సమాచార శాఖలు మీడియా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలి. ఐడీ కార్డుల వెనుక నకిలీ డిజైన్‌లను గుర్తించి, అనధికారిక వ్యక్తులు జర్నలిస్టులుగా వ్యవహరించకుండా కఠిన చట్టాలు తీసుకురావాలి. అలాగే, స్థానిక జర్నలిస్టు సంఘాలు కూడా తమ సభ్యులను గుర్తించడానికి సిస్టమాటిక్ వెరిఫికేషన్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. జర్నలిజం అనేది నమ్మకంతో కూడిన ప్రజాసేవ. అది వృత్తిగా స్వీకరించిన వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీల దురాగతాలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఆఫీస్ అధికారులు గాని,రాజకీయ నాయకులు గాని జర జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి మీకు తెలియని విలేకరులు ఎవరైన మిమ్మల్ని బెదిరించినా లేదా ఇంటర్యూ అడిగినా ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డులను కాని సంస్థ గుర్తింపు కార్డులు అడగండి . యూట్యూబ్ చానల్ పేరుతో బెదిరింపులు,అక్రమ వసూళ్లు కు పాల్పడుతుంటే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వండి. సెల్ పోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్, సెల్ పోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ కాదు వారు ఓన్లీ షోషల్ మీడియా లో పెట్టుకొనేందుకే ఉపయెగపడతారు . ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల ముసుగులో పుట్టగొడుగుల్లా యూట్యూబ్ చానల్స్ పెట్టి జర్నలిస్టులా చలామణి అవుతున్నారు. వీరి ఆగడాలతో నిజమైన జర్నలిస్టుల కు కూడా సమాజంలో చెడ్డపేరు వస్తుంది కనుక నిజమైన జర్నలిస్టులందరూ ఏకంకండి . మనతోపాటు మీడియా సమావేశాలకు యూట్యూబ్ చానల్ పేరుతో చలామణి అవుతున్న నకిలీ విలేకరులు వస్తే ఆ సమావేశాలను బాయ్ కాట్ చేయండి. నకిలీ విలేకరుల బెడద నుండి కాపాడిన జిల్లా ఎస్పీ వి. హర్ష వర్ధన్ రాజు . ఈ నకిలీ విలేకరుల బెడద నుండి కాపాడాలనీ తిరుపతి నగరం లోని ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలు తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్ష వర్ధన్ రాజు దృష్టికి తెలుకెళ్లడంతో స్పందించిన ఎస్పీవి.హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ యుద్ధ ప్రాతిపదికన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తయారు చేయించారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం లోజిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రెస్ స్టిక్కర్లు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్ వాళ్లు మీడియా ప్రతినిధులకు కాని వాళ్ళు అనేకమంది మీడియాలో పనిచేస్తున్నమంటూ చలమణి అవుతున్నారనీ తెలిపారు. నకిలీ విలేకరుల వల్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లు ఇబ్బందికరంగా ఉంటుందని మీడియా ప్రతినిధులు చెప్పడం జరిగిందన్నారు. వారి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని పది రోజులపాటు మా సిబ్బంది శ్రమించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తయారు చేశారన్నారు. ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లను ఏర్పాటు చేశామన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ పేరు, మీరు పని చేస్తున్నా సంస్థ పేరు, మీ డెసిగ్నేషన్, ప్రభుత్వ గుర్తింపుతో కలెక్టర్ ఇచ్చిన అక్రిడేషన్ నెంబర్ వస్తుందన్నారు. ఈ స్టిక్కర్లు ఇవ్వడం వలన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంటూ చెప్పుకుని తిరుగుతున్న నకిలీ విలేఖరులు బయట పడతారన్నారు. మా పోలీస్ సిబ్బంది కూడా క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు చూసిన వెంటనే మిమ్మల్ని ఎవరూ అపరన్నారు. పోలీసు వారికి అనుమానం వస్తే మీ వాహనం మీద ఉన్న క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు స్కాన్ చేస్తారన్నారు. నకిలీ క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు అని తెలిస్తే… చట్టపరమైన చర్యలు తప్పవన్నారు .ఈ క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు పోలీసు వారి అనుమతి లేకుండా ఎవరన్నా తయారుచేసిన అలాంటి వారి పైన చర్యలు తిసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ కీ కృతజ్ఞతలు: మీడియా ప్రతినిధులు :- తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., మీడియా ప్రతినిధుల అభ్యర్థనను మన్నించి క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తిరుపతి లో ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు.దీనివలన నకిలీ ప్రెస్ వాళ్కు పని చేసే ప్రెస్ వాళ్లకు మధ్య తేడా తెలుస్తుందన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..