

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలానికి చెందిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కలిశారు.ఈ సమావేశంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మల్లూరు గ్రామానికి చెందిన ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి, సాయి పటేల్ పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, సంక్షేమ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీనాక్షి సూచించారు. లోకల్ బాడీ ఎన్నికలపై వ్యూహాలు, జుక్కల్ అభివృద్ధిపై కార్యాచరణ రూపొందించాలంటూ నేతలకు సూచనలు ఇచ్చారు.
42% బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీ వర్గాల సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అదే విషయాన్ని ఆమెకు నేతలు వివరించారు.