

మన న్యూస్ తిరుపతి :– బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయస్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం తెలిపారు. ఆదివారం తిరుపతి నగరంలోని శివ జ్యోతి నగర్ లో ఉన్న ద్రోణాచార్య బ్యాట్మెంటన్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. అండర్ 17 బాలికల డబుల్యు విభాగంలో జిల్లా స్థాయి పోటీలలో శాన్వి గోల్డ్ మెడల్ సాధించారు. అండర్ 15 బాలుర విభాగంలో రోహిత్ ప్రత్యర్థి క్రీడాకారుని చిత్తుచిత్తుగా ఓడించి బ్రాంచ్ మెడలను కైవసం చేసుకుని ప్రేక్షకుల మనలను పొందారు. గెలుపొందిన క్రీడాకారులను టిడిపి రాష్ట్ర బీసీ సెల్ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం, టిడిపి సాంస్కృత విభాగం నాయకులు శంభోల హరినాథ్, విజయలక్ష్మి అభినందించారు. కోచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను జగన్నాథం చేతుల మీదుగా అందజేశారు.
