

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాయినాధుని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతుపాలెం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సిబిఎన్ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీశ్ దర్శించుకున్నారు. ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు జగదీష్ కు ఘనస్వాగతం పలికారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏపూరి శ్రీను సాయినాధుని దర్శించుకున్నారు. శ్రీను మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రాంబాబు, కోలా ధన బాబు, గుణ్ణం వెంకటరమణ, చీకట్ల నాని, పంది చక్రధర్, చక్కపల్లి హరి, తదితరులు పాల్గొన్నారు.