మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్టచర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.సోమవారం జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు,వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ,అటవీ భూముల ఆక్రమణ,మహిళా సంఘాలకు రుణాలు వంటి అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అదనపు సబ్ స్టేషన్లు నిర్మించాలన్నారు.నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ కాల్వల నిర్మాణ పనులు,అవసరమైన భూ సేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు.సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతల పథకాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాద నలను ఈనెల 9 నాటికి అందిస్తే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించేలా చూస్తా నన్నారు.జుక్కల్ నియోజకవర్గంలో వంద పడ కల ఆస్పత్రి, ట్రామా కేర్సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు.డీఎంఎఫ్లై నిధులను ఆస్పత్రిలో అవస రమైన వైద్య పరికరాల కొనుగోలు,పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిం చాలని కలెక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *