మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి.ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయడంతో ఆరవ తరగతిలో ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఇప్పటివరకు 145 ఆరో తరగతి ప్రవేశాలు జరిగినట్లు ఆమె తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆహారంతో పాటు పుస్తకాలు,స్కూల్ బ్యాగులు, యూనిఫామ్ లు తో పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలు చేరుకున్న వారు అనేకమంది ఉన్నారన్నారు. ఈ సమావేశంలోఉపాధ్యాయులు,మువ్వల లొవ ప్రసాద్, వనమా శ్రీరామ్,ఎ సురాన్న దొర,కే విద్యాలక్ష్మి తదితరులు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *