filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: null; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4194304;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 293.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శర్మ మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత తయారీ కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని,గోమయం, గో మూత్రం,ఆవు నెయ్యి, ఆవు పాలు వీటితో వస్తువులు తయారు చేయడం జరుగుతుందని,గో ఆర్క్, గోమయం సబ్బులు, సాంబ్రాణి కడ్డీలు,షీల్డ్ అనేక వస్తువులను తయారు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
అలాగే ఈ గో ఆర్క్ సర్వరోగ నివారిణి అని గుండె జబ్బులను,కొవ్వు స్థాయిని తగ్గిస్తుందని, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని,రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఇలా 180 వ్యాధులను తగ్గించే గుణం ఉందని ఆయన తెలిపారు. కొన్ని జిల్లాలలో స్టాల్స్ పెట్టి గోవస్థులను ప్రదర్శించి అమ్మడం జరిగిందన్నారు. గోవస్తులు కావలసిన వాళ్లు మమ్మల్ని సంప్రదించాలన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *