బద్వేల్, జూన్ 23: మన న్యూస్:

జీవో నెంబర్ 5కి వ్యతిరేకంగా బద్వేల్ ఆర్డీవో కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు భారీగా నిరసన వ్యక్తం చేశారు ‘ జీవో నెంబర్ 5ను సవరించి, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, నేషనల్ ఇంక్రిమెంట్స్, మంజూరు చేయాలని, అలాగే రేషన్ లైజేషన్, మరియు మిగులు సిబ్బందిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, అలాగే సొంత మండలంలో సొంత మున్సిపాలిటీలలో నే బదిలీలకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 5 వల్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నష్టం వాటిల్లేగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *