మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలలో విద్యార్థుల ప్రేవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని(ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటనలో తెలిపింది.
విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు ద్వారా ఎంపిక చేపట్టడం జరుగుతుందని ఇప్పటికే తెలుపుగా తేదీలను ప్రకటించింది.5 వ తరగతి బాలికల ప్రవేశానికి ఈనెల 22వ తేదీన,కాకినాడలో ఎస్ఎం నగర్ లో తక్షణ ప్రవేశాలు కల్పిస్తారని. బాలురకు ఈ నెల 23 వ తేదీన ద్రాక్షారామం యందు స్పొట్ అడ్మిషన్ ప్రక్రియ చేపడతారని తెలిపారు.6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బాలికలకు ఈనెల 25 వ తారీఖున కాకినాడ ఎస్ఎం నగర్ లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నారని, 6వ తరగతి నుండి 9వ తరగతి బాలురకు ఎల్ ఎన్ పురం లో స్పోట్ అడ్మిషన్ చేపడతారని తెలిపారు.
జూనియర్ ఇంటర్ అమ్మాయిల స్పాట్ అడ్మిషన్ ఈనెల 26వ తేదీ పి వెంకటాపురం లో జరగనుందని, జూనియర్ ఇంటర్ అబ్బాయిలు స్పాట్ అడ్మిషన్ ఈనెల 27వ తేదీ ద్రాక్షారామంలో నిర్వహిస్తారని (ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్)ప్రకటించింది.కావున విద్యార్ధిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రవేశాల కొరకు దరఖాస్తులు ముద్దుగా ఆయా గురుకుల పాఠశాలల్లో అందించాలని. ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శారదాదేవి తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *