మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామం టిడిపి కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కి ఉచిత సాంసంగ్ ట్యాబులు ప్రత్తిపాడు నియోజవర్గం శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం సేవలందించే మెప్మా సభ్యులకు ఈ టాబ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధి సేవలను ఇకపై రిసోర్స్ పర్సన్స్ టాబ్లను వినియోగించుకుని ఆన్లైన్ ద్వారా సులభతరంగా వారి విధులను నిర్వర్తించవచ్చు అని అన్నారు. ఎస్ హెచ్ జి గ్రూపుల నిర్మాణం, ఎస్ ఎల్ ఎఫ్ గ్రూపుల నిర్మాణం, ఆధార్ సీడింగ్, బ్యాంకు లింకేజ్, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాలు వంటి వాటి నిర్వహణ కు ఈ ట్యాబులు ఉపయోగపడతాయని అన్నారు. 26 రిసోర్స్ పర్సన్స్ కి ఈ టాప్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ తో పాటు మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ జి సాయికుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్ పి అప్పలనాయుడు, మరియు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *