మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:

నీట్ ఎంట్రన్స్ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థి గొల్లపల్లి వైష్ణవిని ఎంఎల్ఎ అభినందించారు. ఆదివారం ఎంఎల్ఎ పరుపుల సత్యప్రభ ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన వైష్ణవని కలిసి అభినందించారు. సాలువ కప్పి సత్కరించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వైష్ణవి సాధించిన ఘనతను కొనియాడుతూ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
అనంతరం గ్రామంలో తల్లికి వందనం పొందిన కుటుంబాలు ఎంఎల్ఎను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *