

మన న్యూస్: పినపాక రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో మణుగూరు రెడ్డి సమాఖ్య అధ్యక్షులు నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నాయకులు కలిసినట్లు శనివారం తెలిపారు.. మణుగూరు మండలంలో రెడ్డి సంఘం భవన్ కు నిధులు మంజూరు చేయాలని, స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం మర్యాద పూర్వకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి శాలువా కప్పి, వ్యవసాయ రంగానికి చిహ్నమైన ఎద్దుల బండి అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు, పినపాక మండల రెడ్డి సంఘం నాయకులు , ఉడుముల తిరుపతి రెడ్డి, సీరపు గణేష్ రెడ్డి, మైత్రి గ్రూప్స్ అధినేత సానికొమ్మ వెంకటరెడ్డి, సానికొమ్మ వెంకటేశ్వర రెడ్డి (బిఎస్ఎన్ఎల్), గాయం ఆవినాష్ రెడ్డి, బంకు శ్రీనివాస రెడ్డి ,జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.