మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్‌ నివాసంలో సంబరాల. నిర్వహించిన నాయకులు, కార్యకర్తలురాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం, బిజేపీ, జనసేన పార్టీల కూటమి 2024లో ప్రభంజనం సృష్టించి 164 సీట్లు సాధించించి. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి భారీ విజయం నమోదు చేయగా.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేశారు. విపిఆర్‌ నివాసంలో కేకు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి దంపతులు కేకు కట్‌ చేసి నాయకులకు పంచారు. అలాగే టీడీపీ నాయకులు డేవిడ్‌ జాన్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు 25 కేజీల కేకును ఏర్పాటు చేయగా.. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కట్‌ చేసి నాయకులకు పంచారు. చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు, రాష్ట్రం సుభిక్షంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెం అర్బన్‌, రూరల్ మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్ లతో పాటు కోవూరు నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *