

Mana News :- ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు గురువారం సాయంత్రం తాడేపల్లిలో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి గోవింద్ అన్న బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించి ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై అడిగి తెలిసుకున్నారని,నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడ్డ నీకు లాంటి యువకులకు తగిన గుర్తింపు ఇస్తానని,కూటమీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు పెట్టినవారికి అండగా నిలబడాలని ఆయన సూచించినట్లు మీడియాతో అన్నారు.