మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల ప్రజల ఆధ్వర్యంలో గంజివారి కల్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ విభాగం సివిల్ జడ్జి కోర్టు సింగరాయకొండలో ఏర్పాటు చేయుటకు విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్ కె మన్మధరావును ఘనంగా పౌర సన్మానము చేశారు.

ఈ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి డా జస్టిస్ మన్మధరావు మాట్లాడుచు కోర్టు ఏర్పాటుతో నా వృత్తి దర్మం నేను పాటించానన్నారు.తన న్యాయవాద వృత్తి ప్రారంభం నుండి సామాజిక స్పృహతో, అభ్యుదయ భావాల ఉన్నానని అదే క్రమంలో హైకోర్టు న్యాయమూర్తిగా తక్కువ సమయంలో పదమూడు వేల కేసులకు తీర్పు ఇచ్చానని తెలియజేసారు.

న్యాయవాదులు కూడా తమ కేసుల విషయంలో త్వరితగతిన అయ్యే విధంగా చూసుకోవాలన్నారు.
సింగరాయకొండ కోర్టు ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకోని మాత్రమే ఏర్పాటు చేశామని, ఈ అంశంలో హైకోర్టు మరియు ప్రభుత్వం సహాయ సహకారాలతో అందించాయని అన్నారు.
కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు సభకు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా శ్రీ పంగులూరి గోవిందయ్య,
ప్రముఖ చారిత్రక పరిశోధకులు కొంపల్లి సుందర్,ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు నూకసాని సుబ్బారావు, న్యాయవాది మేకల రామ్మూర్తి మరియు సింగరాయకొండ మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు వచ్చి డా. జస్టిస్ కె మన్మధరావును సన్మానించుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *