{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

త్రాగునీటికి రాజకీయరంగు

ఎవరికి ఏమి చెప్పాలో అధికారుల అవస్థలు.

గోపవరం: మన న్యూస్: మే 26:
గోపవరం మండలం ఎస్ రామాపురం గ్రామంలోని పెద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల నుండి పోరాటం చేస్తున్నా, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడంలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ మా సమస్యను చెప్పుకున్నా, ఈరోజుటికీ మూడు నెలలు కావస్తున్నా మా గోడు వినిపించుకునే నాయకుడు గాని అధికారులు గానీ లేని పరిస్థితి. మంచినీటి బోరు చెడిపోవడంతో మంచినీటి కోసం మూడు నెలలుగా అల్లాడుతున్నారని వారు అన్నారు. సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. కానీ ఈ విషయం రాజకీయ రంగు కులుముకొని బోరు పైపులైన్లను వేరే వర్గం అక్రమిత పొలంలో ఉండడం వలన దళితులకు నీరు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొర్ర పెట్టుకున్న ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. అధికారులు వారి పనులు చేసుకుని పోతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారు తప్ప మా సమస్యలు పట్టించుకోవడం లేదు. దయవుంచి రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు ఎంపీడీవో, సెక్రెటరీ మాకు తాగే నీరు సమస్య పరిష్కారం చేయాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *