. మన న్యూస్ ,సూళ్లూరుపేట ,మే 26:తెలుగుదేశం పార్టీ అధినేత,పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించే””మహానాడు”” తెలుగు వాళ్లకు ఒక పండగ లాంటిది అని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ మాట్లాడుతూ….. కడపలో ఈనెల 27,28,29వ తేదీలలో జరగనున్న “”మహానాడు”” కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి 7వేల మంది పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు,కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ,ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి “”మహానాడు””ను విజయవంతం చేయాలని అన్నారు.రాష్ట్రంలో ఆనాడు దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు.అలాగే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడానికి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అంటూ ముందడుగు వేస్తున్నారన్నారు.. ఇవన్నీ ప్రజలు గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టే ఈ “”మహానాడు”” మహాయజ్ఞంకి ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు,తరలివచ్చి మహానాడు ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ శ్రీ, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *