మన న్యూస్ ,గూడూరు ,మే 26:తూర్పు గూడూరు, దర్గావీధి యందు వెలసియున్న శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా రహంతుల్లా అలై వారి గంధ మహోత్సవం ఫకీర్ల జరబులతో, విద్యుత్ పూల అలంకరణములతో మేళ తాళాలతో హజ్రత్ గంధము మతగురువులు, ఫాతెహా చదివింపులు, సలామ్ల అనంతరం హజ్రత్ వద్ద గంధము ఎక్కించి గంధ తీర్ధప్రసాదములు పంచబడును. కావున భక్తాగ్రేసులందరు పై ఈ కార్యక్రమాలలో పాల్గొని హజ్రత్ కృపకు పాత్రులగుదురని కోరుకుంటున్నాము.తేది 28-05-2025 బుధవారం రాత్రి 7-00 గంటలకు నిషాన్ అనంతరం అన్నదానం.తేది 31-05-2025 శనివారం సందల్మాలి (చందన సేవ) రాత్రి 9-00 గంటలకు.తేది 02-06-2025 సోమవారం గంధమహోత్సవం.తేది 04-06-2025 బుధవారం తహలీల్ ఫాతెహా ఉదయం 6-00 గంటలకు (జియారత్).తేది 02-06-2025 సోమవారం సాయంత్రం 7-00 గంటలకు దర్గా ఆవరణములో అన్నదాన కార్యక్రమము జరుగునుఅని పత్రిక ప్రకటనలో దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటి గూడూరు వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *