

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు.
జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా,ఉత్కంఠగా సాగాయి.ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పోటీదారులు వచ్చారు.ఉదయంటెంకాయతో కొట్టి ప్రారంభమైన ఈ పోటీలు సాయంత్రం కు ముగిశాయి.చిన్న వారు చిన్న వారితో.. పెద్ద వారు పెద్దవారితో విడివిడిగా కుస్తీపట్లు పడ్డారు.కుస్తీ పోటీలో గెలుపు పొందిన మరయోధులకు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,ఎస్ ఐ శివకుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు శ్రీనివాస్ లు కలిసి నగదును అందజేశారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,కర్ణాటక, జహీరాబాద్, నారాయణ ఖేడ్,బీదర్,తదితర ప్రాంతాల నుంచి మరలయోధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కుస్తీ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చీకోటి జగన్, రాజం గంగారాం,మామిడ్ల పోచయ్య,పెద్దోల్ల సాయిలు,రాజంరాములు,మెంగారం శ్రీనివాస్,మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
