

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం ద్వారా రైతుల కోసం సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో రైతులకు జీలుగు విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..30 కిలోల బస్తా ధర 2137.50 రూపాయలు అన్నారు. గ్రామాల్లోని రైతులందరూ జినుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని నవ్య,ఏఈవో రేణుక, సొసైటీ సిబ్బంది మిడత సాయిలు, మల్లారెడ్డి,గజ్జల బలరాం,తదితరులు ఉన్నారు.