


మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని గాలిపూర్,కోమలంచ, గ్రామాలల్లోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి నవ్య తనిఖీ చేశారు.అనంతరం దుకాణాలల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్,ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణాలల్లో నాణ్యమైన విత్తనాలను సరైన ధరలకు విక్రాయించాలని డీలర్లకు సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే మాకు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విక్రయించిన విత్తనాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలను అందజేయాలని సూచించారు.