మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం 32వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు గౌస్ బాషా వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలసి పనిచేద్దాం. అందరికి ఆహ్వానం పలుకుతున్నా రండి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడు. ఆ పార్టీ బాగుంటుందని మనసా వాచా నమ్ముతాను అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ సాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మేఘనాధ్ సింగ్, ముఫీద్ తదితరులు పాల్గొన్నారు.
