మన న్యూస్ ,నెల్లూరు:- ఏడాది కాలంలో కోవూరు నియోజకవర్గానికి 11 సార్లు CMRF చెక్కులు యిచ్చి పేదలను ఆదుకున్నారు.- అనారోగ్య పీడితుల మానవత్వం తో స్పందిస్తున్న సి ఎం కిధన్యవాదాలు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చంద్రబాబు నాయుడు రెండు కోట్ల 35 లక్షలు అందజేశారు అన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో గల ఆమె నివాసంలో శుక్రవారం17 మందికి 19 లక్షల 50 వేలు విలువ గల CMRF చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 170 మంది నిరుపేదలైన అనారోగ్య పీడితులను ఆదుకున్నా మన్నారు. అనారోగ్య పీడితులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆమె కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమలో ఇందుకూరుపేట మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, కొడవలూరు టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, విడలూరు మండల టిడిపి అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, బుచ్చి రూరల్ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్, టిడిపి నాయకులు సురా శ్రీనివాసులు రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




