మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరు కనుపర్తిపాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులో కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుల పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ…… తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పని చేస్తోందని అని అన్నారు.పార్టీ ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలును తీసుకువచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తోంది అని అన్నారు.అభివృధిని పరుగులు పెట్టిస్తూ.. రాష్ట్రంలో అమరావతి పునః నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ను శరవేగంగా పూర్తిచేయడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి వర్ణించలేనిది అని అన్నారు.కార్యకర్తలకు నారా లోకేష్ బాబు చేస్తున్న కృషి స్పందిస్తున్న విధానం రాష్ట్రంలో ఏ నాయకుడు లేరు అని అన్నారు.ఇది నిజమైన పేదల పార్టీ.కార్యకర్తలకు సముచిత స్థానం, కోట్లలో క్రియాశీలక సభ్యత్వాలు, అలాగే ఐదు లక్షల బీమా సౌకర్యం వంటి అంశాలు టీడీపీ ప్రత్యేకత అని అన్నారు.తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం ఒక అదృష్టం, పార్టీని విశ్వసించిన వారిని పార్టీ ఎప్పుడూ ఆదరిస్తుంది అని అన్నారు.పై కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి , మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ , పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , 7 నియోజకవర్గల శాసన సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ MLC లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.



