జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం లో జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షుడు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాలు దోహదపడతాయని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు.ఈ శిబిరంలో కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం 160 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.వీరిలో 30 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం సోమవారం కిరణ్ కంటి ఆసుపత్రికి పంపిస్తున్నట్లు నిర్వాహకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవిందు తెలిపారు.ఈ సందర్బంగా జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవిందు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి వారు రోగులందరికీ ఉచితంగా చికిత్స, రవాణా,మందులు,భోజన వసతి కల్పిస్తారని,శస్త్రచికిత్స అనంతరం పాలోఆప్ ట్రీట్మెంట్ కూడా నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్,జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, ఏలేశ్వరం జనసేన టౌన్ నాయకులు ఎండి అధికార్,గంగిరెడ్ల మణికంఠ,పలివెల వెంకటేష్,మాజీ ఎంపీటీసీ వనుమ్ మంగ,ధనేకుల వీరభద్రం,జనసైనికులు సాగి వెంకటరమణ, సింగులూరి నాని,గోగుల అఖిల్ తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *