

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి, జగన్నాథ్ పల్లి,లింగంపల్లి గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి ముగ్గు వేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. కొలతల ప్రకారం ఇంటి నిర్మాణం నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు మల్లప్ప పటేల్,కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
