మన న్యూస్, కోవూరు,మే13:- నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకై చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కృషి చేస్తున్నారు. – ఉద్యోగ సాధనకై నిరంతర కృషి చేయండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. – దేశ భవిషత్తు యివత చేతుల్లోనే వుంది. – యువత స్వయం ఉపాధి దిశగా కృషి చేయాలి. – ఎపి స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ జాబ్ మేళాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాష్టంలో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించారని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని సిద్దార్ధ కళాశాలలో ఎపి స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జాబ్ మేళాకు హాజరైన యువతకు దిశా నిర్దేశం చేస్తూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. పిల్లలను ప్రయోజకులుగా చూడాలన్న తల్లి తండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె యువతకు హితోపదేశం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకై ప్రభుత్వమే స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నచ్చిన ఉద్యోగ వేటలో సమయం వృధా చేయకుండా అందుబాటులో వున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు. అవసరమైతే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ దిశగా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. పరిశ్రమల స్థాపన ద్వారా నెల్లూరు జిల్లా యువతకు ఉపాధి కల్పించే దిశగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని ఇండ్రస్ట్రియల్ హబ్ గా మారుస్తానన్నారు. నిరాశ నిసృహలు దరి చేరనీయకుండా సాధిస్తామని ధృడ సంకల్పంతో అడుగు ముందుకేయాలని తన మేటివేషనల్ ప్రసంగంతో యువతీ యువకులలో ఉత్సాహం నింపారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 మోగా జాబ్ మేళాలు నిర్వహించి 2 వేలకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రతి ఒక్కరు ఎసి రూములు 4 డిజిట్ సాలరీ ఆశిస్తూ వచ్చిన చిన్న చిన్న అవకాశాలను వదిలేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. తన విజయం కోసం నిస్వార్ధంగా పని చేసిన యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. బుచ్చిరెడ్డి పాళెం జాబ్ మేళాకు హాజరైన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎపి స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అధికారులను కోరారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు కుట్టు మిషన్లు యిచ్చి స్వయం ఉపాధికి కృషి చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ దేవలెప్మెంట్ అధికారి ఖయ్యాం ఖాన్, సెట్నల్ అధికారి నాగేశ్వరరావు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వినయ్ కుమార్, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీహరి టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య, కోడూరు కమలాకర్ రెడ్డి, టంగుటూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
