మన న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లోని స్థానిక ఈద్గామిట్ట షాదీ ఖానా లో కిషోర్ బాలికలపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమమును ఉద్దేశించి ICDS సూపర్వైజర్ రిజ్వానా మాట్లాడుతూ
కిషోర్ బాలికలు ఆరోగ్యం,విద్య, వైద్యం తదితర అంశాల గురించి మాట్లాడారు.
సాంత్వన సేవా సమితి డైరెక్టర్ జయ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మికలు, బాలల అక్రమ రవాణా, వెట్టి చాకిరి నుండి పూర్తిగా విముక్తి కలిగించాలని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చిమట సుధాకర్ , సూపర్వైజర్ మసూద్ ఆలీ , సెక్రటరీ సుశీల గారు, చంద్రశేఖర్ , సూపర్వైజర్, సైదాబీ , రేణుమల రాజశేఖర్, ఎం రాజారావు మహిళా పోలీస్ సిబ్బంది, మరియు గర్భవతులు పాల్గొన్నారు